Araadhinchedanu – ఆరాధించెదను
ఆరాధించెదను నా యేసుని నామము
కీర్తనలే పాడుచూ నా యేసుని సన్నిధిలో
స్తుతిగీతముల్ పాడెదన్ నను ప్రేమించు యేసుకై-2
||ఆరా||
1. పరిశుద్ధమైన నామం
పూజింపతగిన నామం ||పరి||
శక్తి కలిగిన నామం
నజరేతుని యేసు నామం ||శక్తి||
||ఆరా||
2. నను పోషించెడి నామం
నన్నిలలో రక్షించు నామం ||నను||
నిన్న నేడు నిరంతరం
ఏకరీతిగా ఉండునామం ||నిన్న||
||ఆరా||
3. కీర్తించగలిగిన నామం
ప్రభావము కలిగిన నామం. ||కీర్తించ||
పాపము క్షమియించు నామం
నీతి మార్గములో నడిపించు నామం ||పాపము||
||ఆరా||