Keerthaneeyuda – కీర్తనీయుడా
కీర్తనీయుడా నా షాలేము రాజా
నిన్నే స్తుతియించి ఘనపరుతును దేవా
. ||కీర్త||
1.నా ఆశ్రయదుర్గము నీవే దేవా
నా రక్షణాధారము నీవే దేవా. ||నా||
నీ సన్నిధిలో నా హృదయమును
నిలుపుకొనే కృపను నాకొసగుము దేవా ||నీ||
||కీర్త||
2.నా సహాయకుడవు నీవే దేవా
నా నిరీక్షణాస్పదము నీవే దేవా. ||నా||
నీ నీతిని నీ రక్షణను
దినమెల్ల ప్రకటించే కృపనివ్వుమయ్యా. ||నీ||
||కీర్త||
3.నా రక్షణ కర్తవు నీవే దేవా
నా పాప విముక్తుడవు నీవే దేవా. ||నా||
నీ వాక్యముచే నీ మార్గములో
నడుచుకునే కృపను నాకొసగుము దేవా||నీ||
||కీర్త||