Nee Maadiri maaku – నీ మాదిరి మాకు

నీ మాదిరి మాకు నేర్పుమయా
నీ కృప మాకు నొసగుము దేవా ||నీ||
ఆరాధనా నీకే ఆరాధనా-4. ||నీ మాదిరి||
1.పొరుగు వారిని ప్రేమించమని
శత్రువునైన ద్వేషించుకుమని
కీడుకు ప్రతికీడు చేయకుమనియు-2
మాదిరి చూపినా మా యేసయ్యా-2
||నీ మాదిరి||
2.తగ్గించుకొని ఇల జీవించి
దూషణకు ప్రతిగా దూషించకుమని ||తగ్గించు||
దేవుని చిత్తము నెరవేర్చుమని-2
మాదిరి చూపిన మా యేసయ్యా-2
||నీ మాదిరి||
3.హింసించు వారికై ప్రార్థించమని
శ్రమ పెట్టబడినను బెదిరించుకుమని ||హింసించు||
ఓర్పును సహనమును కనుపరచుమని-2
మాదిరి చూపిన మా యేసయ్యా-2
||నీ మాదిరి||