Gaali Thuphanulu – గాలి తుఫానులు

Gaali Thuphanulu – గాలి తుఫానులు

గాలి తుఫానులు సుడిగాలులే 
నన్ను చుట్టిననూ- ఈ లోకశ్రమలు 
వేదన బాధలు కృంగదీసిననూ ||గాలి|| 
నా యేసు హస్తాలలో క్షేమముగా ఉందును-2
 
1.అలలు వరదలై నన్ను ముంచినా 
ప్రవాహము నాపై పొర్లినా.    ||అలలు||
కన్నీరు విడుచుచూ విత్తుచూ
సంతోషముతో పంటకోసెదా ||కన్నీరు||
యేసయ్య నీకే స్తోత్రము-4    ||గాలి|| 
 
2.పగలు ఎండ దెబ్బైనను 
రాత్రి వెన్నెల దెబ్బైననూ    ||పగలు||
తగులకా నన్ను కాపాడువాడు
కునుకడూ నిదురపోడు     ||తగులక||
యేసయ్య నీకే స్తోత్రము-4  ||గాలి|| 
 
3.తల్లిదండ్రులే నన్ను విడిచినా 
బంధుమిత్రులే నిందించినా ||తల్లి||
నా యేసు మార్గములో సాగుచూ
విశ్వాసముతో జీవించెదను ||నా||
యేసయ్య నీకే స్తోత్రము-2  ||గాలి|| 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *