Kruthagnatha Sthuthi – కృతజ్ఞతా స్తుతి
కృతజ్ఞతా స్తుతి చెల్లించెదం
ప్రభుయేసు నాధుని సన్నుతించెదం ||కృత||
యేసురాజు మనతో నుండగా
మనకేల భయము ఓ సోదరా (సోదరి) ||యేసు||
||కృతజ్ఞతా||
1.నమ్మదగినవాడు మన దేవుడు
నమ్మకముగా జీవించమన్నాడు ||నమ్మ||
నమ్ముట నీవలనైతే నమ్మువానికి
సమస్తము సాధ్యమని అన్నాడు ||నమ్ము||
||కృతజ్ఞతా||
2.వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు
అవి కూడా తన మాటలే వినమన్నాడు. ||విను||
మనిషి రొట్టె వలనె కాదు నా నోట నుండి
వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునన్నాడు ||మనిషి||
||కృతజ్ఞతా||