Gaali Thuphanulu – గాలి తుఫానులు
గాలి తుఫానులు సుడిగాలులే నన్ను చుట్టిననూ- ఈ లోకశ్రమలు వేదన బాధలు కృంగదీసిననూ ||గాలి|| నా యేసు హస్తాలలో క్షేమముగా ఉందును-2 1.అలలు వరదలై నన్ను ముంచినా ప్రవాహము నాపై పొర్లినా. ||అలలు||కన్నీరు విడుచుచూ విత్తుచూసంతోషముతో పంటకోసెదా ||కన్నీరు||యేసయ్య నీకే స్తోత్రము-4 ||గాలి|| 2.పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైననూ ||పగలు||తగులకా నన్ను కాపాడువాడుకునుకడూ నిదురపోడు ||తగులక||యేసయ్య నీకే స్తోత్రము-4 ||గాలి|| 3.తల్లిదండ్రులే నన్ను విడిచినా బంధుమిత్రులే నిందించినా ||తల్లి||నా యేసు మార్గములో సాగుచూవిశ్వాసముతో జీవించెదను ||నా||యేసయ్య నీకే స్తోత్రము-2 ||గాలి||