Bible College Ministry- (Christian Theological Seminary)

బైబిలు తర్ఫీదు పరిచర్య

నేను 2011 నుంచి 2018 వరకు పాస్టర్ జోషి లీలన్ రెడ్డి గారి పర్యవేక్షణలో “ఇండియా థియాలాజికల్ సెమినరీ” అనే “బైబిల్ సెమినరీ”లో శిక్షణ తీసుకుని M.Th (OT&NT)పూర్తి చేసిన తర్వాత నావలే అనేకమంది బైబిల్ లోని  జ్ఞానం తెలుసుకోవాలని ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి “క్రిస్టోస్ థియాలజికల్ సెమినరీ” అనే బైబిల్ తర్ఫీదు కేంద్రం ప్రారంభించాను.

2019 జనవరిలో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభించి 2020 ఆగస్టు 27న (10 మందికి)సర్టిఫికెట్స్ ఇవ్వటం జరిగింది. 2021 సెప్టెంబర్ నుండి రెండో బ్యాచ్ కొనసాగుతోంది. ఇలా అనేక మందికి నేను నేర్చుకున్నది అనేకమందికి నేర్పించాలన్న ఆకాంక్షను దేవుడు తీరుస్తూ ఉన్నారు. ఈ బైబిలు తర్ఫీదు పరిచర్యలో నాతోపాటు, నాతో కలిసి శిక్షణ పొందిన వారు పాస్టర్ పి.మోజెస్ గారు(విజయవాడ), పాస్టర్ వి.వి.బాలసుభ్రమణ్యం గారు(కోదాడ), పాస్టర్ సి.హెచ్.వరకుమార్ గారు(కైకలూరు) కూడా బోధిస్తూ వున్నారు.

వీరిని బట్టి దేవున్ని నేనెంతగానో స్తుతిస్తూవున్నాను. మూడవ బ్యాచ్ కూడా ప్రారంభించబడుతుంది. మా CTS తర్ఫీదు కేంద్రం కొరకు ప్రార్థించండి.