Church Ministry

సంఘ పరిచర్య

పాస్టర్ కోట ప్రభుదాసు గారు సంఘంలో విశ్వాసిగా ఉన్న కాలములో రక్షణ కొరకై ఉపవాస ప్రార్ధనలో ఉన్నప్పుడు 1994 అక్టోబరు 10 న తెల్లవారు జామున ఒక దర్శనం ద్వారా దేవుడు సేవ కొరకు పిలిచాడు. అయితే సేవకులు ప్రభుదాసు గారు చెప్పినా దేవుని మాటకు లోబడక నిర్లక్ష్యంగా వుంటూ 13 సంవత్సరాలు దేవుని పరిచర్యకు సిద్ధపడక  నా స్వంత నిర్ణయాలతో తిరుగుతున్న కాలంలో 2007లో జూన్ 4వ తేదీన కైకలూరు డిగ్రీ కాలేజ్ వెనుక మా సొంత గృహములో “యేసుక్రీస్తు సహవాస ప్రార్థన మందిరం” ప్రారంభించి పరిచర్య కొనసాగించుటకు దేవుడు కృప చూపారు.

దేవుని కృపలో 2009లో పూర్తి పరిచర్యకు రావడం అప్పట్నించి పరిచర్య కొనసాగించుటకు దేవుని  మాయెడల చూపిన కృపను బట్టి దేవునికి మేము ఋణస్థులము. 2011 డిసెంబర్ 23 నా తల్లి గారైన బడుగు సుబ్బాయమ్మ గారు ఇచ్చిన స్థలములో ఒక నూతన మందిరం నిర్మించి ప్రతిష్టించి దానిలో ఆరాధన కార్యక్రమాలు జరుగుటకు దేవుడు కృప చూపినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞుణ్ణి. అప్పటినుంచి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. 2021లో మందిరము మరొక 17 అడుగులు పెంచుట ద్వారా ఇప్పటి మందిరము 44 ×16 అడుగుల కొలతలతో ఉన్నది.

దేవుడు నాకప్పగించిన కొన్ని ఆత్మలను కాస్తూ, మేపుతూ దేవుని రాకడకు మేము సిద్ధపడుతూ వారిని సిద్ధపరుస్తూ పరిచర్య కొనసాగించుచున్నాము.ఇదే మందిరములో “బైబిల్ క్లాసులు”, “సెమినార్సు” జరుగుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ వున్నాము. మా సంఘ పరిచర్య కొరకు ప్రార్థించండి.