Dhurdhinaalu Raakamunde – దుర్దినాలు రాకముందే

దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకో
సమయము పోనీయక మంచి మార్గమెంచుకో -2
1.నీటి బుడగలాంటి నీ జీవితం
ఎప్పుడు పగులునో అది నీకు తెలియదు ||నీటి||
రేపటి దినము గూర్చి అతిశయించకు
నేడేమి సంభవించునో నీకు తెలియదు ||రేపటి||
. ||దుర్దినాలు||
2.దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండి
అది ఇది చేతుమని చెప్పుకో మిత్రమా. ||దేవుని||
నీ జీవమేపాటిది కొంతసేపు కనబడి
అంతలోనే మాయమవు ఆవిరి వంటిది కాదా ||నీ||
||దుర్దినాలు||