Kanna thalli prema kanna – కన్న తల్లి ప్రేమ కన్నా
కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమా
యేసు ప్రేమా నా యేసు ప్రేమా -2
మరువని విడువని నా యేసు ప్రేమా-2
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా-2
||కన్న||
1.పిండమైయుండగా నన్ను గుర్తెరిగిన ప్రేమా
తల్లి గర్భమందే నన్ను పెంచిన ప్రేమా ||పిండమై||
తల్లి మరచినను నను మరువని ప్రేమా-2
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా-2
. ||కన్న||
2.పాపినైయుండగా నన్ను క్షమియించిన ప్రేమా
నశించిపోయే నన్ను రక్షించిన ప్రేమా ||పాపినై||
సిలువలో నాకై మరణించిన ప్రేమా-2
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా-2
||కన్న||
3.కృంగియుండగా నన్ను ఓదార్చిన ప్రేమా
కనుపాప వలే నన్ను కాపాడిన ప్రేమా ||కృంగి||
నిత్యము ఎడబాయక వెంటాడిన ప్రేమా-2
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా-2
||కన్న||