Music ministry

గాన పరిచర్య

నేను చదువుకునే రోజుల నుండి లోక సంబంధమైన పాటలు పాడుతూ అనేక బహుమతులు తీసుకున్నాను. 1994 అక్టోబర్ 28న బాప్తిసం తీసుకున్నప్పటినుంచి లోక సంబంధమైన పాటలు మాని దేవుడిచ్చిన స్వరాన్ని దేవుని కొరకు ఉపయోగించాలని తీర్మానంతో అనేక చోట్ల సువార్త గాయకుడుగా దేవునిచే వాడబడితిని. నా కుమార్తె 2000 జూన్ 27న ప్రభువు నందు నిద్రించుగా నా కుమార్తె జ్ఞాపకార్థం గా 2001లో సహోదరుడు కరుణాకర్(విజయవాడ)సంగీత పర్యవేక్షణలో “నా ప్రార్ధన” అనే (8 పాటలు) ఆల్బమ్ చేయడం జరిగింది. దానిలోని పాటలు రచించుటకు, స్వర్గకల్పన చేయుటకు, గానం చేయుటకు దేవుడు కృప చూపారు.

అంతేకాక ఇతరుల క్యాసెట్స్ లో కూడా కొన్ని పాటలు పాడుటకు దేవుడు కృప చూపారు . 2007లో సహోదరుడు మధుకర్ జాన్సన్(విజయవాడ)సంగీత పర్యవేక్షణలో “నా ఆలాపన” అనే (8 పాటలు)ఆల్బమ్ చేయడం జరిగింది. 2022లో సహోదరుడు శ్యామ్.కె.శ్రీనివాస్(విజయవాడ)సంగీత పర్యవేక్షణలో “నీ మాదిరి మాకు నేర్పుమాయా”అనే పాట రికార్డింగ్ చేసి YouTube ద్వారా FaceBook ద్వారా అనేక మంది వినుటకు అవకాశం కలిగింది. దేవుని చిత్తమైతే సహోదరుడు సామ్యూల్ రాజు(గుంటూరు)సంగీత పర్యవేక్షణలో “ఆరాధించెదను నా యేసుని నామము” అనే పాట 2023 అక్టోబరులో రికార్డింగ్ పూర్తియై విడుదల కానుంది ప్రార్థించండి.

 Facebook (Vijaya Prasad Badugu) ద్వారా YouTube (jcf ministries) ద్వారా దేవుని వాక్య పరిచర్యను, గానపరిచర్యను వీక్షించి , ఆలకించి ప్రోత్సాహపరుస్తారని,నా గురించి, నా పరిచర్య గురించి ప్రార్థిస్తారని ఆశిస్తూ………

 

మీ సహోదరుడు

బడుగు విజయ ప్రసాద్.