Naa Prardhana – నా ప్రార్ధనా
నా ప్రార్ధనా ఆలకించుమా
సజీవుడా నీతిమంతుడా…. నీతిమంతుడా
||నా ప్రార్థనా||
1.ఎండిన భూమి వలె
నా ఆత్మ ఆరిపోయెనూ ||ఎండిన||
నీ పూర్ణ ఆత్మతో నా హృదిని నింపి
నా ఆత్మ చిగురింపజేయుమా ||నీ||
||నా ప్రార్థనా||
2.నాలోని ఆత్మ క్షీణించినా
నా ఆత్మ కృంగినను ||నాలోని||
నీయందే నమ్మికతో నా ప్రాణము నిలిపెదవని
ఆశతో నీకై ప్రార్ధించితిని ||నీయందే||
||నా ప్రార్థనా||
3.నా కలిమి విస్తరించినా
నా జీవానికి మూలము కాదయా ||నా||
నా జీవ ఊటలే నీయందే ఉన్నవని
నీ జీవజలములకై నేవేచితి. ||నాజీవ||
||నా ప్రార్థనా||