Nee prematho Nannu – నీ ప్రేమతో నన్ను
నీ ప్రేమతో నన్ను రక్షించు దేవా
నీ ప్రేమతో నన్ను క్షమియించు దేవా
యేసయ్యా ఎంత గొప్ప ప్రేమ నీది
యేసయ్య ఎంత ప్రేమమూర్తివయ్యా||యే||
||నీ ప్రేమ||
1.తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమా
బంధుమిత్రుల ప్రేమ కన్నా విలువైన ప్రేమా||తల్లి||
నీ ప్రేమ లోతు నేనెరుగగలనా-2
నీ ప్రేమ మాధుర్యము వివరించు దేవా-2
||నీ ప్రేమ||
2.ఎన్ని శ్రమలైనా నన్ను వెంటాడినా
శోధన బాధలెన్నో నన్ను కృంగదీసినా||ఎన్ని||
నీ ప్రేమ నానుండి వేరు కాదయ్యా-2
సత్యమైన నిత్య ప్రేమ నొసుగిన నా దేవా-2
||నీ ప్రేమ||