Paraloka Naadhuda – పరలోకనాథుడా
పరలోకనాథుడా నజరేతు యేసువా
ఎవరున్నారు నాకిలలో నీవేగా నా సర్వము
||పర||
1.దేవతల కంటే పూజనీయుడవు
ఆకాశము భూమి సృజించినవాడవు||దేవా||
నీ రక్షణ సువార్త ప్రకటించుచు
నీ మహిమను ప్రచురించెదన్ ||నీ||
||పర||
2.మార్గము సత్యము జీవము నీవైతివే
నిన్న నేడు నిరంతరము నీవే. ||మార్గము||
నీ ఆదరణయే నా ప్రాణమునకు
నెమ్మది కలిగించును. ||నీ||
||పర||
3.మరణపు ముల్లును విరచినవాడవు
మరణమునే జయించినవాడవు ||మరణ||
నా పాపముకై నీ విలువైన ప్రాణము
బలిగా అర్పించినావు. ||నా||
||పర||